భానుమతికి మిస్ అయిన మిస్సమ్మ

విజయా వారి ’మిస్సమ్మ’ లో మిస్సమ్మ పాత్రకి మొదట భానుమతిని తీసుకున్నారని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి ఆ పాత్రని సావిత్రితో వేయించారని చాలామందికి తెలుసు. కానీ అసలు జరిగిందేమిటన్నది ఎంతో మందికి తెలియదు. ఆ సినిమాలో భానుమతి నటించడం నిజమే. కొన్ని సీన్లు షూట్ కూడా ఛేశారు. ఒకరోజు తన ఇంట్లో వ్రతం వుందని లేట్ గా వచ్చారు భానుమతి. ఇలా లేట్ అవుతుందని ఇన్ఫార్మ్ చెయ్యలేదు. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు చక్రపాణి. ఆమె సెట్ లోకి రాగానే ’ఈ సినిమా నుండి మిమ్మల్ని తొలగించాం’ అని చెప్పారు. భానుమతి కూడా సీరియస్ అయ్యారు. వెంటనే వెళ్ళి నాగిరెడ్డి గారికి కంఫ్లయింట్ చేశారు. ఆయన వెంటనే తన మేనేజర్ ని పిలిచారు.

బానుమతి గారితో తీసిన సీన్స్ నెగిటివ్ లన్నీ డెవెలప్ అయ్యాయా ?’ అడిగారు. ’రెడీగా వున్నాయండీ’ అని చెప్పాడా మానేజర్. ’వాటిని తీసుకురా’ అని ఆర్డరేశారు నాగిరెడ్డి. ఆ ప్రకారమే అన్నీ క్షణంలో ఆక్కడికి చేరుకున్నాయి. అందరూ చూస్తుండగానే ఓ అగ్గిపుల్ల తీసి వెలిగించి వాటి మీద పడేశారు నాగిరెడ్డి.  అవాక్కయిపోయారందరూ భానుమతితో సహా. ’మీరు ఓ ఆడపడుచుగా మా ఇంటికి రావచ్చు. ఈ స్టూడియోకి రావచ్చు కానీ ఈ విషయంలో చక్రపాణి డెసిషనే ఫైనల్’ అన్నారు. అలా ఆ కథ ముగిసింది.



 భానిమతి నటించిన నెగిటివ్ లు కాలిపోయాయి. స్టిల్స్ ఎక్కడున్నాయో తెలియదు. పత్రికల్లో ఆ రోజుల్లో పడిన పేపర్ కటింగ్ లు మాత్రం - మిస్సమ్మ సినిమాలో మొదట భానుమతి నటించారన్న చరిత్రకు సాక్ష్యం గా మిగిలాయి.

Comments